Chicken Waste | హైదరాబాద్ నుంచి ఏపీకి చికెన్​ వ్యర్థాలు.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా చికెన్ వ్యర్థాల తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chicken Waste | హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా చికెన్ వ్యర్థాల తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. చేపల దాణాగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​ నగరంలో వేలాది చికెన్​ సెంటర్లు ఉన్నాయి. వాటిలో కోళ్లు కోసిన తర్వాత వ్యర్థాలను సరైన రీతిలో డిస్పోజ్​ చేయడం లేదు. నగరంలో కొంత మంది చికెన్​ సెంటర్ల నుంచి వ్యర్థాలను సేకరించి దందాకు పాల్పడుతున్నారు. ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లు, కల్లు కంపౌండ్​, పర్మిట్​ రూమ్​లలో దుకాణాలు నిర్వహించే వారికి విక్రయిస్తున్నారు. అంతేగాకుండా అక్రమంగా ఏపీకి సైతం తరలిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని చేపల చెరువుల్లో చేపలకు చికెన్​ వ్యర్థాలను మేతగా వినియోగిస్తున్నారు.

Chicken Waste | తిన్నారంటే అంతే..

ఇలాంటి వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు హెచ్చరించారు. దాదాపు 100 టన్నుల కోడి వ్యర్థాలను సైబరాబాద్ పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Ganja Seized | హైదరాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *