తెలంగాణPolice Leave Policy | పోలీసులకు గుడ్​న్యూస్​.. ఆ రెండు రోజులు లీవ్​

Police Leave Policy | పోలీసులకు గుడ్​న్యూస్​.. ఆ రెండు రోజులు లీవ్​

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్​ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి గుడ్​ న్యూస్​ చెప్పింది. పుట్టిన రోజు, పెళ్లి రోజు తప్పనిసరి లీవ్​ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Police Leave Policy | రాష్ట్ర ప్రభుత్వం పోలీస్​ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి గుడ్​ న్యూస్​ చెప్పింది. వీక్​ ఆఫ్​ లేకుండా నిరంతరం సేవలు అందిస్తున్న పోలీసులు (Police) సెలవుల కోసం అనేక ఇబ్బందులు పడుతుంటారు. వారికి ఊరటనిచ్చేలా తాజాగా సర్కార్​ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం పోలీసులకు వీక్​ ఆఫ్​ లేదు. అయితే అవసరం అయితే లీవ్​ తీసుకోవచ్చు. ఈ మేరకు పై అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిస్థితిని బట్టి లీవ్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో తమ పుట్టిన రోజులు, పెళ్లి రోజుల సమయంలో సెలవులు దొరకక సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల పుట్టిన రోజు, పెళ్లి రోజు నాడు తప్పక సెలవు మంజూరు చేయాలని ఆదేశించింది.

Police Leave Policy | డీజీపీ ఉత్తర్వులు

తెలంగాణ పోలీసు శాఖ ఉద్యోగులకు వారి పుట్టినరోజులు, పెళ్లి వార్షికోత్సవాల సందర్భంగా ఇకపై తప్పక సెలవు మంజూరు చేయాలని డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు బలగాల మనోధైర్యాన్ని, వ్యక్తిగత శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమంగా దీనిని డీజీపీ అభివర్ణించారు. పోలీసు విధుల కఠిన స్వభావాన్ని, సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో చేసే వ్యక్తిగత త్యాగాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Police Leave Policy | దరఖాస్తు చేసుకోవాలి

తెలంగాణ పోలీసులోని ప్రతి సభ్యుడు హోదాతో సంబంధం లేకుండా, వారి జీవితంలోని ఈ ముఖ్యమైన వ్యక్తిగత ఘట్టాలను తమ కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు కోసం సిబ్బంది సెలవు కోరినప్పుడల్లా అసాధారణ పరిస్థితులు మినహా, అన్ని యూనిట్ అధికారులు సెలవు మంజూరు చేయాలి. సర్వీస్ రిజిస్టర్ (Service Register) ప్రకారం చెల్లుబాటు అయ్యే రుజువు ఉంటేనే ఈ సెలవు మంజూరు చేస్తారు. దీని కోసం సిబ్బంది ముందుగానే రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : IAS Couple | భార్యాభర్తలు.. పక్క పక్క జిల్లాల కలెక్టర్లు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...