Kamareddy Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

కామారెడ్డి రైల్వేస్టేషన్​లో భారీగా గంజాయి పట్టుబడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganja Seizure | జిల్లా కేంద్రంలోని (Kamareddy) రైల్వే స్టేషన్‌లో (Railway Station) ఎక్సైజ్, రైల్వే టాస్క్​ఫోర్స్ (Railway Task Force) పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఎండు గంజాయి పట్టుబడింది.

Kamareddy Ganja Seizure | సంబల్​పూర్​ నుంచి నాందేడ్​ వెళ్తున్న రైలులో..

సంబల్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు స్టేషన్‌లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగులో 2 కిలోల చొప్పున నాలుగు ప్యాకెట్లు, మరో కిలో ప్యాకెట్ కలిపి మొత్తం 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కిషన్ పటేల్‌గా గుర్తించారు.

తన స్నేహితుడికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు చెబుతున్నప్పటికీ, విక్రయించేందుకే తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ తెలిపారు. ఈ దాడులలో ఆర్పీఎఫ్ ఎస్సై జి. వెంకటేశ్వర్లు, ఏఎస్సై పి. రవీంద్రబాబు, సిబ్బంది బయ్యాలు, బాలా సాహెబ్, చంద్రశేఖర్, మీనాక్షి, శివాని, ఎక్సైజ్ ట్రైనీ ఎస్సైలు శ్రీనివాస్, మధు, అనిల్, రచన, సిబ్బంది ఫరీద్, పవన్, బాబు, రాజు, దినేష్, రమ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  కేంద్రం ముందు మోకరిల్లిన రేవంత్ సర్కార్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *