BC Welfare Committee | బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: BC Welfare Committee | బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. శాసనసభలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ (2026–27) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రాథమిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

BC Welfare Committee | వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో..

తెలంగాణ శాసన పరిషత్ సమావేశ మందిరంలో శాసన మండలి (లెజిస్లేచర్) (Telangana Legislature) వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ సమావేశం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమం, వారి సమస్యలు, అభివృద్ధి, హక్కులు తదితర అంశాలపై చర్చించారు. బీసీలకు విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల అభివృద్ధికి ఈ కమిటీ ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు అందించనుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు.

బీసీ సంక్షేమశాఖకు కేటాయించిన బడ్జెట్ నిధుల వినియోగం, రాష్ట్రంలోని బీసీ వర్గాల విద్యార్థుల విద్యా, వసతి గృహాల్లో వసతులు, అదేవిధంగా వారి సంక్షేమపథకాలు స్థితిగతులు తదితర అంశాలపై ఈ కమిటీ పర్యవేక్షణ ఉంటుందని.. అందులో భాగంగానే కమిటీ తొలి సమావేశాన్ని ఈరోజు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కమిటీ ఛైర్మన్ మక్కన్ సింగ్ ఠాకూర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Pilot Doping Test | పైలట్లకు డోపింగ్ టెస్ట్​.. కేంద్రం యోచన..

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *