Balkonda Ganja Arrests | వరద కాలువపై దర్జాగా గంజాయి సేవిస్తున్న పలువురి పట్టివేత

దర్జాగా వరద కాలువపై గంజాయి సేవిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: Balkonda Ganja Arrests | దర్జాగా వరద కాలువపై గంజాయి (Ganja) సేవిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బాల్కొండ (Balkonda) మండలంలోని బుధవారం చోటు చేసుకుంది.

Balkonda Ganja Arrests | వన్నెల్​(బి) గ్రామంలో..

మండలం వన్నెల్ (బి) (Vannel B) గ్రామంలోని వరద కాలువ గట్టు వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో బాల్కొండ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గట్టుపై సుమారు 18మంది గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వారికి గంజాయి విక్రయించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు.

విచారణలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన వ్యక్తి వద్ద 40 గ్రాముల ఎండు గంజాయి, చిన్న చిన్న జిప్‌లాక్ కవర్ల ప్యాకెట్, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. బానిసైన మిగతా 18 మందిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించనున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: యశ్ మూవీపై నెటిజన్ల ట్రోల్స్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *