Cyber Frauds | ఫోన్లు చోరీ చేసి.. సైబర్​ మోసాలు చేస్తున్న ముఠా

సెల్​ఫోన్లను చోరీ చేసి సైబర్​ నేరస్తులు ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Frauds | సైబర్​ దొంగలు రెచ్చిపోతున్నారు. మాయ మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అంతేగాకుండా ఫోన్లను చోరీ చేసి సైతం సైబర్​ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ (Hyderabad)​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్ (CP Sajjanar)​ సూచించారు.

జేబుదొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారని పేర్కొన్నారు.

Cyber Frauds | వెరిఫికేషన్​ పేరిట..

నిందితులు ఫోన్​ చోరీ చేస్తున్నారు. అనంతరం లాక్​ తెలియకపోతే.. ఫోన్​ కోసం బాధితులు కాల్​ చేసినప్పుడు ఓనర్​ వెరిఫికేషన్​ కోసం లాక్​ అడుగుతున్నారు. అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్‌లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరించి సైబర్​ నేరాలు చేస్తున్నారు. ఇలా నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్​ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ఫోన్​ పోతే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరికీ కూడా స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు చెప్పవద్దని సూచించారు.

ఇది కూడా చదవండి : Harish Rao | భూములు కబ్జా చేస్తున్న సీఎం రేవంత్​రెడ్డి : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.