అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Hospital Death | గర్భసంచి ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ ఆస్పత్రిలో ఆకస్మికంగా మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.
Kamareddy Hospital Death | జీవధాన్ ఆస్పత్రిలో..
పట్టణంలోని జీవధాన్ ఆస్పత్రిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కోసం వచ్చిన లింగంపేటకు చెందిన పరిష రాజేశ్వరి అలియాస్ లాస్య (38) మృతి చెందింది. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి అనస్థీషియా ఇవ్వగానే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో కేస్ షీట్ కూడా రాయలేదని, కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకోకుండానే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంగా యాక్టివ్‌గా ఆస్పత్రికి వచ్చిన రాజేశ్వరి హార్ట్ స్ట్రోక్‌తో ఎలా చనిపోతుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో వైద్యులు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలికి తొమ్మిదేళ్ల కూతురు శ్రీవల్లి, ఐదేళ్ల కుమారుడు వైభవ్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: AP Drought Crisis | రాష్ట్రంలో కరువు ఉన్నా సీఎం స్పందించడం లేదు : వైఎస్ జగన్