Nepal Floods | నేపాల్​ వరదలు.. భారత్​ అప్రమత్తం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Floods | నేపాల్​ వరదల్లో వందలాది మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ వరదలతో నేపాల్​ సరిహద్దులో గల భారత్​లోని రాష్ట్రాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.

భారత-నేపాల్ సరిహద్దు వెంబడి అత్యవసర సహాయక చర్యల కోసం సశస్త్ర సీమా బల్ (SSB)కు చెందిన 11 రక్షణ మరియు సహాయక బృందాలు సన్నద్ధమవుతున్నాయి. NDRF కమాండెంట్ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో, ఆ తర్వాత నేపాల్ దిగువ ప్రాంతాల్లో వరద సంభవించిందన్నారు. ఇది గండక్ నదిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. గండక్ నదీ పరీవాహక ప్రాంతాలైన పశ్చిమ చంపారన్, ముజఫర్‌పూర్‌లలో రెండు బృందాలను మోహరించామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ (UP)లో దీని ప్రభావం పడే అవకాశం ఉన్న కుషినగర్ ప్రాంతం గండక్ నది పక్కనే ఉందన్నారు. అక్కడ కూడా బృందాలను మోహరించామని వెల్లడించారు. వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే బీహార్‌ (Bihar)లో 9, ఉత్తరప్రదేశ్‌లో 11 NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

Nepal Floods | కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు

నేపాల్‌లో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్ పౌరులను సురక్షితంగా తరలించేందుకు యూపీ అధికారులు కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అలాగే రాష్ట్రంలో నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న జిల్లాల్లోని పరిస్థితులను కూడా నిశితంగా గమనిస్తున్నారు.

Nepal Floods | కొనసాగుతున్న సహాయక చర్యలు

వరదలపై భారత్​లోని నేపాల్ రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నేపాల్ భద్రతా సంస్థలు, విపత్తు నిర్వహణ అధికారులు ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. పరిస్థితి ఇంకా అనిశ్చితంగా ఉన్నందున, మృతులు, గల్లంతైన వ్యక్తులు, నష్టం పూర్తి స్థాయికి సంబంధించిన సమాచారం ఇప్పుడే చెప్పలేమని తెలిపింది.

దీనిని కూడా చదవండి : Cyber Frauds | ఫోన్లు చోరీ చేసి.. సైబర్​ మోసాలు చేస్తున్న ముఠా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *