Telangana Rain Alert | రైతులకు అలర్ట్​.. నేటి నుంచి తగ్గనున్న వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Telangana Rain Alert | అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున మోస్తరు వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ చిరు జల్లులు కురిసే ఛాన్స్​ ఉంది. వికారాబాద్​, మెదక్​, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, వనపర్తి, గద్వాల్​, నాగర్​కర్నూల్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.

Telangana Rain Alert | పెరగనున్న ఉష్ణోగ్రతలు

సెప్టెంబర్​ మొదటి వారం వరకు రాష్ట్రంలో వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఉత్తర, తూర్పు తెలంగాణాల్లో మినహా, మిగిలిన తెలంగాణలో చిరుజల్లులు కురుస్తాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. రాబోయే 10 రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగి, వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొంటుంది. సెప్టెంబర్ మొదటి వారం నాటికి వర్షాభావ లోటు -20 శాతం దాటనుంది.

ఇది కూడా చదవండి..: Komatireddy Rajagopal Reddy | భట్టి విక్రమార్కతో భేటీపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *