అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mir Alam Lake Tourism | పాతబస్తీలోని మీర్ ఆలం చెరువు పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. చెరువు వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం ఉదయం ఆయన ఆకస్మికంగా పరశీలించారు.
పాతబస్తీ రూపురేఖలను మార్చే లక్ష్యంతో ప్రభుత్వం మీర్ ఆలం చెరువు అభివృద్ధి పనులు చేపట్టింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఆధ్వర్యంలో చెరువు వద్ద ‘కేబుల్-స్టేడ్ బ్రిడ్జి’ (cable-stayed bridge) నిర్మిస్తున్నారు. ఈ పనులను సీఎం పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మీర్ ఆలం చెరువను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆయన చెరువు కట్ట చుట్టూ కారులో పర్యటించారు. క్రేన్ ఎక్కి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.
Mir Alam Lake Tourism | రూ.430 కోట్లతో..
రూ. 430 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వంతెన శాస్త్రిపురాన్ని చింతల్‌మెట్ రోడ్‌తో కలుపుతుంది. ప్రాజెక్ట్‌లో అప్రోచ్‌లు, లైటింగ్, సుందరీకరణ, సరస్సు పునరుద్ధరణ పనులు కూడా ఉన్నాయి. సీఎం మాట్లాడుతూ.. మురుగునీరు చెరువులోకి చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు నుంచి మూసీ నదికి వరద నీటిని తీసుకువెళ్లే నాలాను వెడల్పు చేయాలన్నారు. చెరువు వద్ద వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువులోని ఐలాండ్స్‌ను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Nepal Floods Control Room | నేపాల్ వరదలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం