అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Arrest | హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళనకు, ధర్నా నిర్వహిస్తున్న టీఎన్జీఓ (TNGO) నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అన్ని ఆంక్షలను దాటుకుని హరీశ్ రావు హన్మకొండ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సుబేదారి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన వెళ్లారు.
Harish Rao Arrest | బీఆర్ఎస్ శ్రేణుల నిరసన..
హరీశ్ రావు అరెస్ట్‌ను బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా స్పందిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బలగాలతో నొక్కేస్తోందని మండిపడ్డారు. ఈ ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
Harish Rao Arrest | ఆందోళనకు అసలు కారణం..
వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టగా, మరోవైపు టీఎన్జీఓలు కూడా ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరీశ్ రావును శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు అరెస్ట్ చేసి తరలించడంతో ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది.
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్
హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన
కనీసం వాహనం కూడా ఎక్కించకుండా
కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని తరలించిన పోలీసులుహనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు… https://t.co/HLzRkpDMba pic.twitter.com/rYakgfi9Gm
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026
ఇది కూడా చదవండి: Kamareddy Flood Funds | ఏడాదైనా వరద నిధుల జాడేది : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్