అక్షరటుడే, కామారెడ్డి: Employee Issues Telangana | ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి, కో ఛైర్మన్ చకినాల అనిల్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని (Kamareddy) కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో టీజీఈజేఏసీ (TJEJAC) రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు.
Employee Issues Telangana | నాలుగు డిమాండ్ల సాధన కోసం..
పీఆర్సీ (PRC Telangana), ఆరు పెండింగ్ డీఏలు, పది వేల కోట్ల బకాయి బిల్లులు, సీపీఎస్ రద్దు అనే నాలుగు ప్రధాన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న మహాధర్నాలో భాగంగా కామారెడ్డిలో ధర్నాను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా నాయకత్వాన్ని అభినందించారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వం అని, ఉద్యోగుల సమస్యలన్నీ తాము పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పీఆర్సీకి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు ప్రకటించకపోవడం, అమలు చేయకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
Employee Issues Telangana | ఏ రాష్ట్రంలోనూ ఆరు డీఏలు పెండింగ్లో లేవు..
ఏ రాష్ట్రంలోనూ ఆరు డీఏలు పెండింగ్ లో లేవని, ఒక్క తెలంగాణలోనే ఉండటం దురదృష్టకరమని, వెంటనే వాటిని ప్రకటించాలని టీజీఈజేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రూ.పది వేల కోట్ల పెండింగ్ బిల్లుల కారణంగా పెన్షనర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వారి బాధను ప్రభుత్వం గమనించాలని, ప్రభుత్వంలో భాగస్వాములైన వారు ఎన్నో ఏళ్లుగా అందించిన సేవలను గుర్తించి వెంటనే బిల్లులను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి దానిని అమలు చేయకుండా మేనిఫెస్టోను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగుల ప్రధాన హక్కులైన పీఆర్సీ, ఆరు పెండింగ్ డీఏలు, పది వేల కోట్ల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఉద్యమ షెడ్యూల్ లో భాగంగా సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర మహాధర్నాకు లక్షల మంది ఉద్యోగులు హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాలో టీజీఈజేఏసీ జిల్లా సెక్రెటరీ జనరల్ దేవేందర్, అడిషనల్ సెక్రెటరీ జనరల్ కుషాల్, కో ఛైర్మన్లు ఆకుల బాబు, పంపరి ప్రవీణ్ కుమార్, రాజు, లింగం, బషీర్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ ఎల్లారెడ్డి, ప్రేమ్ కుమార్, చక్రధర్, నాగరాజు, సాయిరెడ్డి, దేవుల, ముజుబొద్దీన్, విఠల్ రావు, హనుమంత్ రెడ్డి, పర్వతయ్య, నీలం లింగం, మనోహర్, రాజకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కొండా కుటుంబం ఎటువైపు? కీలక రాజకీయ పరిణామంపై ఆసక్తికర చర్చ!