అక్షరటుడే వెబ్‌డెస్క్: ASBL Legacy | హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఏఎస్బిఎల్’ (ASBL) అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఏఎస్బిఎల్ లెగసీ’ పేరుతో కొత్త నివాస ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. సాంప్రదాయకంగా ఈ ప్రాంతంలో విడివిడి భవనాలే ఎక్కువగా ఉన్నప్పటికీ, సెంట్రల్ హైదరాబాద్ నడిబొడ్డున మొట్టమొదటి సారిగా ఈ సంస్థ ఒక గేటెడ్ కమ్యూనిటీని తీసుకువస్తోంది. నగర కేంద్రంలో నివసిస్తూనే తమ జీవనశైలిని మెరుగుపరుచుకోవాలనుకునే వారి కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.
ASBL Legacy | గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు..
హైదరాబాద్ అభివృద్ధి ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలో సాగినప్పటికీ, బలమైన కనెక్టివిటీ , సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్న సెంట్రల్ హైదరాబాద్‌లో మాత్రం తగినంత స్థలాలు లేకపోవడంతో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు వెనుకబడ్డాయి. ఈ లోటును పూడ్చేలా నగర నడిబొడ్డున నివాసితులకు అన్ని సదుపాయాలను అందిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దారు.
ASBL Legacy | ప్రాజెక్ట్ వివరాలు..
సుమారు 7.97 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో జి+50 అంతస్తుల వరకు ఉండే మూడు టవర్లను నిర్మిస్తున్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ప్రాంతంలో ఇదే అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. రూ. 1.99 కోట్ల ప్రారంభ ధరతో 3 , 4 బీహెచ్‌కే గృహాలను అందిస్తున్నారు. ఇందులో దాదాపు 73.25% స్థలాన్ని ఓపెన్ స్పేస్‌గా (ఖాళీ స్థలంగా) కేటాయించారు. ప్రాజెక్ట్‌లో 74,000 చదరపు అడుగుల భారీ క్లబ్‌హౌస్ , సుమారు 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 50కి పైగా అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. టెర్రస్ స్విమ్మింగ్ పూల్, వివిధ రకాల స్పోర్ట్స్ కోర్టులు, క్రికెట్ నెట్లు, స్కేటింగ్ రింక్, జాగింగ్/సైక్లింగ్ ట్రాక్స్, పెట్ పార్క్, 17,000 చదరపు అడుగుల ఫెస్టివల్ లాన్ వంటివి ఉన్నాయి. అలాగే టవర్ బి గ్రౌండ్ లెవల్లో 12,000 చదరపు అడుగుల అర్బన్ కారిడార్‌లో కో-వర్కింగ్ స్పేస్‌లు, క్లినిక్, ఫిజియోథెరపీ గది, ట్యూషన్ గది వంటివి అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ మెట్రో స్టేషన్ నుండి కేవలం 2 నిమిషాలు, కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 8 నిమిషాలు, ఎంజీబీఎస్ నుండి 15 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. వాహన రహిత పోడియం, 2 అంతస్తుల లాబీ, 2 మీటర్ల వెడల్పు గల కారిడార్లు, ప్రతి అంతస్తులో ప్రతి యూనిట్‌కు ఒక లిఫ్ట్ వంటి ప్రత్యేకతలున్నాయి.
ASBL Legacy | ఏఎస్బిఎల్ సీఈఓ అభిప్రాయం..
హైదరాబాద్ ( Hyderabad )అభివృద్ధి ప్రధానంగా పశ్చిమ దిశలోనే జరిగిందని, అయితే సెంట్రల్ హైదరాబాద్‌లో డిమాండ్‌కు ఎప్పుడూ కొరత లేదని ఏఎస్బిఎల్ సీఈఓ & వ్యవస్థాపకుడు అజితేష్ కొరుపోలు తెలిపారు. అయితే సరైన గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి తగినంత పెద్ద భూములు అందుబాటులో లేకపోవడమే ఇక్కడ గృహాల కొరతకు అసలు కారణమన్నారు. ఇప్పటికే పూర్తిగా స్థిరపడిన ఈ ప్రాంతంలోని అపారమైన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు.
2017లో స్థాపితమైన ఏఎస్బిఎల్ సంస్థ గతంలో చేపట్టిన ‘బ్రాడ్వే’ (రూ. 1,000 కోట్లకు పైగా అమ్మకాలు), ‘ల్యాండ్‌మార్క్’ ప్రాజెక్ట్‌లతో భారీ స్పందనను సొంతం చేసుకుంది. గత సంవత్సరం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీగా గుర్తింపు పొందిన ఈ సంస్థ, ఇప్పుడు ‘ఏఎస్బిఎల్ లెగసీ’ ద్వారా సెంట్రల్ హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ఇది కూడా చదవండి: Traffic Control Measures | ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు : సీఎస్ సంజయ్ జాజు