అక్షరటుడే, వెబ్‌డెస్క్: Allu Arjun Forbes | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఇప్పటికే జాతీయ అవార్డు అందుకుని భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఆయన.. తాజాగా ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై మెరిశారు.
‘పుష్ప’తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తీరుకు ఇది మరో గుర్తింపుగా అభిమానులు భావిస్తున్నారు.
Allu Arjun Forbes | అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..
ప్రాంతీయ సినిమా పరిధిని దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫోర్బ్స్ ఇండియా కూడా ఆయన పాన్ ఇండియా స్థాయిలో సాధించిన ప్రభావాన్ని ప్రస్తావించింది.
అల్లు అర్జున్ ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై కనిపించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.
Toxic Event Accident | టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం.. పలువురికి గాయాలు
జాతీయ అవార్డు, పాన్ ఇండియా స్టార్‌డమ్ తర్వాత ఇప్పుడు ఫోర్బ్స్ కవర్‌పై చోటు దక్కించుకోవడం.. బన్నీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఫోర్బ్స్ ఇండియా తాజా సంచికలో “On the cover: Allu Arjun” అంటూ ఆయనను కవర్ స్టార్‌గా పేర్కొంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ ఈ కవర్ కోసం అల్లు అర్జున్‌ను ఫొటోగ్రాఫ్ చేసినట్లు ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది.
వెండితెరపై తన స్టైల్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక బిజినెస్ మ్యాగజైన్ కవర్‌పై కనిపించడం ద్వారా తన స్టార్‌డమ్ మరో స్థాయికి చేరిందని చెప్పొచ్చు. దీంతో “బన్నీ క్రేజ్‌కు మరో కిరీటం” అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.