అక్షరటుడే, డిచ్‌పల్లి: Sampally School | సోదర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకను డిచ్‌పల్లి మండలం సాంపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఆత్మీయంగా నిర్వహించారు. పండుగకు ముందస్తుగా నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థుల మధ్య అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా బాలికలు తమ తోటి బాలురకు ప్రేమగా రాఖీలు కట్టి, సోదర బంధాన్ని చాటుకున్నారు. రాఖీ కట్టిన అనంతరం విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
Sampally School | అనుబంధానికి ప్రతిరూపం
రక్షాబంధన్ కేవలం రాఖీ కట్టుకునే పండుగ మాత్రమే కాదని, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఆప్యాయత, పరస్పర నమ్మకం, రక్షణ భావనలను మరింత బలపరిచే గొప్ప సంప్రదాయమని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. సోదరభావం, ప్రేమ, పరస్పర గౌరవం వంటి విలువలను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు.
Nepal Floods | నేపాల్లో 23 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నారు : పొంగులేటి
వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, రాఖీలతో తమ ఆత్మీయతను చాటుకున్నారు. పాఠశాలలో నిర్వహించిన ఈ వేడుక విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతోపాటు, సోదర బంధం గొప్పతనాన్ని గుర్తుచేసింది.