అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Weather | రాష్ట్రంలో రానున్న పది రోజుల పాటు ఎల్నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. నేటి నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురిసే ఛాన్స్ తక్కువగా ఉందన్నారు. ఒకవేళ వానలు పడినా.. చిరుజల్లులు మాత్రమే కురుస్తాయి.
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా స్వల్ప వర్షాలు కరిసే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఎండ తీవ్రత పెరుగుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో కూడా వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది.
Telangana Weather | 14 శాతం లోటు వర్షపాతం
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదు అయింది. జూన్ 1 నుండి ఆగస్టు 27 వరకు.. సాధారణ వర్షపాతం 544.9 మిల్లీ మీటర్లు కాగా.. 468.8 మి.మీ. వర్షం కురిసింది. 14 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 19 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ మొదటి వారం నాటికి తెలంగాణలో వర్షపాత లోటు 20 శాతం దాటే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కామారెడ్డి, మెదక్ (Medak) జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయింది.
దీనిని కూడా చదవండి : Electric Auto Scheme | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల