అక్షరటుడే, వెబ్‌డెస్క్ : China Earthquake | చైనాలో భూకంపం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు నైరుతి చైనాలోని సియాచిన్ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:13 గంటలకు ప్రావిన్స్‌ను తాకింది. ఈ భూకంప కేంద్రం 29.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 105.22 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. ఈ భూకంపం 13 కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ప్రభావంతో నేపాల్ (Nepal)కు మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
China Earthquake | రెడ్ అలర్ట్..
నేపాల్‌కు మరో భారీ జల ప్రళయం ముప్పు ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఐదు రెట్ల అధిక తీవ్రతతో నేపాల్‌కు వరదలు వస్తాయని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర భయాందోళనలో నేపాల్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
🚨Earthquake Hits Southwest China
5.1-magnitude quake strikes China’s Sichuan
Fresh quake amid Nepal flood crisis https://t.co/jP7eC3ET9y pic.twitter.com/NvwuQw3KvD
— Telugu Feed (@Telugufeedsite) August 28, 2026
దీనిని కూడా చదవండి : BRS Protest | కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట