అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Water Supply | హైదరబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం, ఆదివారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద జీహెచ్ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ (Krishna Water) సప్లై ప్రాజెక్ట్ ఫేజ్–III, రింగ్ మెయిన్–Iకి చెందిన 1500 ఎంఎం వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌పై జంక్షన్ పని చేయనున్నారు. ఈ పనులు శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో ఈ 24 గంటలు కృష్ణా ఫేజ్–III, రింగ్ మెయిన్–I పరిధిలోని కొన్ని రిజర్వాయర్ కమాండింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా అంతరాయం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Hyderabad Water Supply | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, సులేమాన్ నగర్, దుర్గానగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్పూర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదు. వినియోగదారులు సహకరించాలని జలమండలి (HMWS SB) అధికారులు కోరారు.
దీనిని కూడా చదవండి : Nagendra Resignation | అవినీతి ఆరోపణలు.. ఏడుస్తూ రాజీనామా చేసిన మంత్రి నాగేంద్ర