అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Raghavendra Swamy Math | నగరంలోని (Nizamabad) రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ధన్వంతరి ఆరాధన ఉత్సవాల్లో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు.
Raghavendra Swamy Math | దేశంలోనే రెండో ధన్మంతరి ఆలయం
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది సత్యాత్మ తీర్థ శ్రీపాదుల స్వామి చేత ధన్వంతరి స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా నిర్వహించారని గుర్తు చేశారు. దేశంలోనే రెండో ధన్వంతరి ఆలయం కావడం ఇందూరు ప్రజల అదృష్టం అన్నారు. నూతన ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, పవన్ ముందడ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఎవరెస్ట్, ఎల్జీ ఇంగువపై నిషేధం