eSDS Software IPO | పబ్లిక్ ఇష్యూకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ.. జీఎంపీ 83 శాతం పైనే..

సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అందించే ఈఎస్‌డీఎస్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం 83 శాతానికిపైనే ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: eSDS Software IPO | ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీని 2005లో ఏర్పాటు చేశారు. ఐటీ మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణలో రెండు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. భారతదేశంలో క్లౌడ్, మేనేజ్డ్ సర్వీసెస్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అందించే ఏఐ సామర్థ్యం గల సంస్థ ఇది.

ఈ సంస్థ ప్రభుత్వ, బీఎఫ్ఎస్ఐ సంస్థలు, ఎంటర్‌ప్రైజెస్‌ల కోసం డేటా సెంటర్, క్లౌడ్, కోలొకేషన్, మేనేజ్డ్ సర్వీసెస్ మరియు ఏఐ మౌలిక సదుపాయాల పరిష్కారాలను అందిస్తోంది. బ్యాంకింగ్, ప్రజా సేవలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ, రిటైల్, ఇంధనం, లాజిస్టిక్స్ మరియు ఇతర రంగాలలో వర్క్‌లోడ్‌లను నిర్వహించగల మౌలిక సదుపాయాలనూ సమకూరుతోంది.

eSDS Software IPO | 5 చోట్ల డేటా సెంటర్లు..

కంపెనీ నాసిక్, నవీ ముంబయి, బెంగళూరు, మొహాలి, నోయిడాలలో 75,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో టైర్-3 డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. దీని సేవల్లో మేనేజ్డ్ సర్వీసెస్, క్లౌడ్ మరియు డేటా మైగ్రేషన్, డిజాస్టర్ రికవరీ యాజ్ ఎ సర్వీస్, బ్యాకప్ యాజ్ ఎ సర్వీస్, కోలొకేషన్ సర్వీసెస్ మరియు డేటా సెంటర్ సేవలున్నాయి. డేటా సార్వభౌమత్వం, స్కేలబిలిటీ, భద్రత, కంప్లయన్స్ మరియు ఏఐ సామర్థ్యాలపై దృష్టి సారించి, తన సొంత ఏఐ ఆధారిత క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అయిన స్వరాజ్ క్లౌడ్‌ను నిర్మించింది.

eSDS Software IPO | రూ. 720 కోట్ల సమీకరణ లక్ష్యం..

ఈ కంపెనీ ఐపీవో (IPO) ద్వారా సుమారు రూ.720 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని డేటా సెంటర్ల కోసం క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఇతర పరికరాలు, మౌలిక సదుపాయాల కొనుగోలు, సంస్థాపన, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది.

ధరల శ్రేణి : ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 408 నుంచి రూ. 429 గా నిర్ణయించారు. ఒక అప్లికేషన్ లాట్ సైజ్ 34 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద రూ.14,586 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 14 లాట్లకోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కోటా : ఐపీవోలో క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎనఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు.

eSDS Software IPO | భారీగా జీఎంపీ..

కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఒక్కో షేరుకు రూ. 360 గా ప్రీమియం ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ రోజున 83 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 28న ప్రారంభమైంది. సెప్టెంబర్ 1 వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ సెప్టెంబర్ 2 రాత్రి వెలువడుతుంది. కంపెనీ షేర్లు 4వ తేదీన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టవుతాయి.

ఇది కూడా చదవండి..: Agmont Enterprises IPO | ఊరించిన జీఎంపీ.. 22 శాతం లాభాలతో లిస్టయిన అగ్‌మోంట్ షేర్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *