Iran Larack Island Attack | ఇరాన్​లోని లారక్​ ద్వీపంపై అమెరికా దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా ఇరాన్​లోని లారక్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Iran Larack Island Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా ఇరాన్​లోని లారక్ ద్వీపంపై అమెరికా (America) దాడి చేసింది. దీంతో టెహ్రాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది.

హర్ముజ్ జలసంధిలోని లారాక్ ద్వీపంలో ఉన్న ఇరాన్‌కు చెందిన రెండు ప్రయోగ వ్యవస్థలపై అమెరికా దాడి చేసింది. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలు అయ్యాయి.వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గంలోకి సముద్ర మైన్‌లతో కూడిన రాకెట్లను ప్రయోగించడానికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సభ్యులు ప్రయోగ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా దళాలు గుర్తించాయి. అనంతరం వాటిపై దాడి చేశాయి.

Iran Larack Island Attack | అంగీకరించిన ఇరాన్​

ద్వీపంపై దాడి జరిగిందని ఐఆర్‌జీసీ ధృవీకరించింది. ఈ దాడిలో పలువురు సైనిక సిబ్బంది, పౌరులు మరణించారని పేర్కొంది. ఈ దాడికి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కొత్తగా మందుపాతరలు అమర్చే ఏ ప్రయత్నం చేసినా వాషింగ్టన్ చర్య తీసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా ఏకం కావాలని ఈ ప్రాంతంలోని ముస్లిం-మెజారిటీ దేశాలకు ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తర్వాత అమెరికా దాడి చేయడం గమనార్హం. అమెరికా-ఇరాన్ ప్రత్యక్ష దాడులతో ముడిచమురు ధరలు పెరిగాయి.

ఇది కూడా చదవండి..: Cyprus boat capsizes | సముద్ర గర్భంలో మునిగిన ఫెర్రీ.. ఏడుగురి దుర్మరణం.. 23 మంది గల్లంతు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *