అక్షరటుడే, భీమ్గల్: Ambedkar Ideals | సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలను రూపుమాపడానికి అంబేడ్కర్ తన జీవితాంతం కృషి చేశారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సుదర్శన్ నగర్ తండాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు.
Ambedkar Ideals | అందరిపై బాధ్యత
అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సునీల్ అన్నారు. అంబేడ్కర్ అందించిన ‘బోధించు, పోరాడు, సమీకరించు’ (Educate, Agitate, Organize) అనే నినాదం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.