అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana No Bag Day | తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది. ఇదివరకు ఇచ్చిన ‘నోబ్యాగ్ డే’ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
Telangana No Bag Day | భారం తగ్గించేందుకు..
విద్యార్థుల భుజాలపై భారీ పాఠశాల బ్యాగుల భారాన్ని తగ్గించడంతో పాటు, వారిలోని దాగివున్న సృజనాత్మక నైపుణ్యాలను (Creativity & Skills) వెలికితీసేందుకు ప్రతినెలా మూడో శనివారం రోజున విధిగా ‘నో బ్యాగ్ డే’ (No Bag Day) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు (GO Orders) విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఉత్తర్వులు వర్తిస్తుంది. ఒక విద్యా సంవత్సరంలో మొత్తం 10 రోజులను ‘నో బ్యాగ్ డేస్’గా కేటాయిస్తూ అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపర్చారు.
Telangana No Bag Day | ప్రకటించిన ప్రధాన తేదీలు
విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19, నవంబర్ 21, డిసెంబర్ 19, ఫిబ్రవరి 20, మార్చి 20 తేదీలను ప్రత్యేకంగా ప్రకటించారు. మిగిలిన రోజులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలల యాజమాన్యాలు/హెచ్‌ఎంలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
Telangana No Bag Day | ఆ రోజుల్లో ఏం చేస్తారు?’

‘నో బ్యాగ్ డే’ నిర్వహించే శనివారాల్లో విద్యార్థులు ఎలాంటి పుస్తకాల బ్యాగులు లేకుండా ఉల్లాసంగా పాఠశాలలకు హాజరు కావచ్చు. సాంప్రదాయ తరగతి గది పాఠాలకు బ్రేక్ ఇచ్చి విద్యార్థులతో కింది కార్యకలాపాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే వినోదాత్మక ఆటలు, క్విజ్ కార్యక్రమాలు. ప్రాక్టికల్ విజ్ఞానాన్ని పెంపొందించే ప్రయోగాలు చేయిస్తారు. స్థానిక పరిశ్రమలు లేదా క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకెళ్తారు. విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, చిత్రలేఖనం, నాటికలు, స్థానిక చేతివృత్తుల వారితో ముఖాముఖి వంటి విభిన్న సృజనాత్మక కృత్యాలు నేర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను ఆయా జిల్లాల డీఈఓలు (DEOs), ఎంఈఓలు (MEOs), ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అప్పగించింది. ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం తూచా తప్పకుండా అన్ని పాఠశాలలో పక్కగా అమలు చేస్తే విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత బయటపడే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Ambedkar Ideals | అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ముత్యాల సునీల్