జాతీయంModi Football Gangtok | ఫుట్‌బాల్ ఆడిన మోదీ.. యువతతో కలిసి మైదానంలో సందడి

Modi Football Gangtok | ఫుట్‌బాల్ ఆడిన మోదీ.. యువతతో కలిసి మైదానంలో సందడి

గ్యాంగ్‌టక్‌లో స్థానిక యువతతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్‌బాల్ ఆడి సందడి చేశారు. స్పోర్ట్స్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిన ఆయన గోల్స్ కొట్టడం విశేషం.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Modi Football Gangtok | సిక్కిం (Sikkim) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్‌బాల్ మైదానంలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్యాంగ్‌టక్‌లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడి స్థానిక యువతీ యువకులు ఫుట్‌బాల్ ఆడుతున్నట్టు గమనించిన ఆయన, వెంటనే వారివద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. యువతతో స్నేహపూర్వకంగా మాట్లాడిన మోదీ, తాను కూడా ఫుట్‌బాల్ (Football) ఆడతానని చెప్పడం అక్కడి వారిని ఉత్సాహపరిచింది.

Modi Football Gangtok | జెర్సీ ధ‌రించి మ‌రి…

అదే ఉత్సాహంలో కొద్ది సేపటికి స్పోర్ట్స్ జెర్సీ  ధరించి మైదానంలోకి దిగిన ప్రధాని, ఆటగాళ్లతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ఆటలో చురుకుగా పాల్గొంటూ కొన్ని గోల్స్ కూడా కొట్టడం విశేషం. మోదీ (Narendra modi )తో కలిసి ఆడిన యువత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన క్షణాలను చూసేందుకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా యువతతో క్రీడల ప్రాముఖ్యతపై కూడా మోదీ చర్చించినట్లు సమాచారం. శారీరక దారుఢ్యం, జట్టు భావన, క్రమశిక్షణ వంటి విలువలను క్రీడలు పెంపొందిస్తాయని ఆయన సూచించినట్లు తెలిసింది. యువత ఎక్కువగా క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Modi Football Gangtok | సాధారణ ప్రజలతో..

ఈ ఫుట్‌బాల్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రధాని తన సోషల్ మీడియా (Social Media) ఖాతాల్లో పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్‌గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. మోదీ సాధారణ ప్రజలతో కలిసిపోయి ఇలాంటి సరదా క్షణాలను పంచుకోవడం అరుదైన విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన మోదీ, ఈ విధంగా సమయం కేటాయించి యువతతో మమేకమవడం విశేషంగా మారింది. ఈ సంఘటనతో అక్కడి యువతకు మరపురాని అనుభూతి లభించగా, దేశవ్యాప్తంగా కూడా ఈ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి..: 8th Pay Commission Demands | 8వ వేతన సవరణ… ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఎలా ఉన్నాయంటే?

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....