అక్షరటుడే, వెబ్డెస్క్ : AAP Protest | పంజాబ్ అమృత్సర్లోని బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు.
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ ఆగస్టు 20న మరణించిన విషయం తెలిసిందే. ఆయన నివాసానికి వెళ్లి పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు. దీనిని నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్ (MP Tarun Chugh) నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
AAP Protest | ఆప్ పిలుపు మేరకు..
అడిషన్ డీసీపీ మాట్లాడుతూ.. బీజేపీ నాయకుడు తరుణ్ చుగ్ నివాసం వద్ద బలగాలను మోహరించామన్నారు. సజ్జన్ కుమార్ నివాసానికి బీజేపీ నాయకులు వెళ్లడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఇక్కడ గుమిగూడారని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటానికి తగినంత బలగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యే అజయ్ గుప్తా మాట్లాడుతూ.. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులుగా తేలిన వ్యక్తుల నివాసాలకు బీజేపీ సభ్యులు వెళ్లడమే ఈ నిరసనకు కారణమన్నారు. బీజేపీ మతం, ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Ramachander Rao Arrest | బీజేపీ చీఫ్ రామచందర్రావు అరెస్ట్