ఆంధ్రప్రదేశ్​Chittoor journalist murder | చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ హత్య.. మార్నింగ్ వాక్ స‌మ‌యంలో దాడి,...

Chittoor journalist murder | చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ హత్య.. మార్నింగ్ వాక్ స‌మ‌యంలో దాడి, ప్రధాన నిందితుడి గుర్తింపు

చిత్తూరు జిల్లా వి.కోటలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి పై ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chittoor journalist murder | ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో (ABN Andhrajyothi) పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వి.కోట పట్టణంలో ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజులాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆయనపై అకస్మాత్తుగా దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

Chittoor journalist murder | రౌడీ షీట‌ర్ త‌మీమ్‌ ప్ర‌ధాన నిందితుడిగా..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య కేసులో వి.కోటకు చెందిన రౌడీ షీట‌ర్ త‌మీమ్‌ని ప్ర‌ధాన నిందితుడిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka)లో ఉన్నట్లు సమాచారం రావడంతో, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల అసలు కారణాలు ఏమిటి? వ్యక్తిగత వైరం, వృత్తి సంబంధిత కోణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Chittoor journalist murder | జర్నలిస్టుల భద్రతపై

ఈ దారుణ ఘటనను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (Andhra Pradesh Journalists’ Forum), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించాయి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని పేర్కొంటూ, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ ఘటనతో వి.కోట ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జర్నలిస్టుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు త్వరితగతిన నిందితులను పట్టుకుని న్యాయం చేయాలని స్థానికులు, మీడియా వర్గాలు కోరుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Google AI Data Center | గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...