అక్షరటుడే, కామారెడ్డి: PDS Rice Seized | అక్రమ వ్యాపారాలకు జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు అడ్డాలుగా మారుతున్నాయి. తనిఖీలు తక్కువగా ఉంటాయన్న భావనతో అక్రమార్కులు పీడీఎస్ PDS బియ్యం వంటి సరుకులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో పేదలకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
PDS Rice Seized | జాతీయ రహదారిపై తనిఖీలు..
భిక్కనూరు Bhikkanur మండల శివారులోని 44వ జాతీయ రహదారిపై సివిల్ Civil సప్లై, పోలీసు అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో అక్రమంగా తరలిస్తున్న 310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించారు.
పోలీసుల దర్యాప్తు..
పేద ప్రజలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
PDS Rice Seized | మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
లారీతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు భిక్కనూరు పోలీస్ Police స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఏమైనా ఉందా? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.