అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kashmir BJP Protest | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని శ్రీనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన చేపట్టారు. నిరుద్యోగం, అవినీతి ఆరోపణలపై ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
సచివాలయం ముట్టడించానికి ర్యాలీగా బయలు దేరారు. నిరుద్యోగం, అవినీతి, పంచాయతీ ఎన్నికల సమస్యలపై బీజేపీ నిరసన తెలుపుతోంది. లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ నుంచి బయలుదేరి సచివాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ నాయకుడు అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. బీజేపీ నిరసన నేపథ్యంలో శ్రీనగర్‌లోని ఘంటా ఘర్, లాల్ చౌక్ నుంచి సివిల్ సెక్రటేరియట్ వరకు భారీ భద్రతను మోహరించారు.
Kashmir BJP Protest | ధరల పెరుగుదలపై..
ఇటీవల జరిగిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆ నిర్ణయం తప్పనిసరిగా తీసుకున్నారని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని నేషనల్ కాన్ఫరెన్స్ సైతం ఈ రోజు నిరసనలకు పిలుపు నిచ్చింది. ఒకే రోజు రెండు పార్టీల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సునీల్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ఒమర్ అబ్దుల్లాపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 25,000 ఉద్యోగాలను కాంట్రాక్టర్లకు అమ్మేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: MPSC Paper Leak | MPSC పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. పోలీసుల అదుపులో ఏడో ర్యాంకర్.. లీకైన ప్రశ్నపత్రంతో పరీక్ష రాసినట్లు విచారణలో వెల్లడి