Pawan Kalyan Birthday | రెంజల్‌లో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

తెలంగాణలోనూ పార్టీని విస్తరించేందుకు పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, బోధన్‌: Pawan Kalyan Birthday | జనసేన Janasena పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను నిజామాబాద్​ జిల్లా రెంజల్‌ మండల కేంద్రంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.

Nizamabad prohibited land | నిషేధిత భూమికి ఏడుగురు నకిలీ ‘ఓనర్లు’!.. అర్సపల్లిలో రూ. కోట్ల విలువైన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం..సబ్-రిజిస్ట్రార్‌ అరెస్టు

Pawan Kalyan Birthday | పాఠశాలల్లో పండ్ల పంపిణీ.. అన్నదానం

జనసేన పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు మీసాల శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

akshara today .jpgmeesala

ఈ సందర్భంగా మీసాల శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన ప్రభుత్వం అందిస్తున్న పాలనను ప్రజలు ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ పార్టీని విస్తరించేందుకు పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Pawan Kalyan Telangana Strategy | పవన్ కళ్యాణ్ తెలంగాణ ‘మిషన్’: Gen-Z మంత్రం వర్కవుట్ అవుతుందా?

కార్యక్రమంలో జనసేన రెంజల్‌ మండల నాయకులు లోలపు నవీన్‌, కిరణ్‌, సుమన్‌, దినేష్‌, శివ, పవన్‌, రాకేష్‌, గంగాధర్‌, దెబ్బడి సాయి తదితరులు పాల్గొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *