Pastor Abuse Case | ప్రార్థనల పేరుతో దారుణం.. బాలికపై లైంగిక వేధింపులు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వెలుగుచూసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pastor Abuse Case | మహబూబాబాద్ జిల్లా ( Mahabubabad )బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వెలుగుచూసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రార్థనల ముసుగులో మోసాలకు పాల్పడిన చర్చి పాస్టర్ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులకు దేవుని వాక్యాలు చెబుతానంటూ పాస్టర్ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇంట్లోని మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని, ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నాలుగేళ్లుగా ఆమెను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు వివాహం గురించి ప్రస్తావించిన ప్రతీసారీ ఆయన దాటవేస్తూ వచ్చాడు.

Pastor Abuse Case | బ్లాక్‌మెయిల్..

బాధితురాలితో కలిసి దిగిన వ్యక్తిగత , అభ్యంతరకరమైన ఫొటోలను అడ్డం పెట్టుకుని పాస్టర్ బరితెగించాడు. ఇతర మహిళలతో దిగిన ఫొటోలను సైతం వాట్సాప్ ద్వారా పంపుతూ ఆమెను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ బలవంతపు పరిస్థితులను ఆసరాగా చేసుకుని బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. తోటి పాస్టర్లు ఎంత సర్దిచెప్పినా ఆయన తన ప్రవర్తనను మార్చుకోలేదు.

Pastor Abuse Case | పోలీసుల స్పందన..

ఈ అన్యాయంపై విసిగిపోయిన బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు కలిసి బుధవారం బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయించారు. పాస్టర్‌తో పాటు ఆయన తల్లిపై ఫిర్యాదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై బయ్యారం ఏఎస్ఐ స్వప్న మాట్లాడుతూ.. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Sep 03 Gold Prices | అమెరికా ఉద్యోగ గణాంకాలపై బులియన్​ మార్కెట్ చూపు.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *