అక్షరటుడే, కామారెడ్డి: Accident in Kamareddy | రెండు కార్ల మధ్యలో స్కూటీ ఇరుక్కుని బాలుడి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలో చోటు చేసుకుంది.
Accident in Kamareddy | కామారెడ్డి పట్టణంలో..
స్థానికుల కథనం ప్రకారం.. హోటల్ ఇంటర్నేషనల్ వద్ద డిగ్రీ కళాశాల వైపు నుంచి కామారెడ్డి బస్టాండ్ వైపు రెండు కార్లు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. అదే సమయంలో సడెన్‌గా యూటర్న్ తీసుకున్న ఓఎలక్ట్రిక్ స్కూటీ రెండు కార్ల మధ్యలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన హేమంత్(15) మృతి చెందగా.. అదే కాలనీకి చెందిన లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే వారిని జీజీహెచ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ సిటీలోని సంతోష్ నగర్లో అందుబాటులోకి స్టీల్ బ్రిడ్జి ఆకట్టుకుంటోంది.