Cabinet Expansion | తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై మళ్లీ నీలినీడలు.. ఆశావహులకు నిరాశేనా?

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన క్యాబినెట్ విస్తరణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cabinet Expansion | తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన క్యాబినెట్ విస్తరణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో, మంత్రివర్గ విస్తరణ కూడా వెంటనే ఉంటుందని, కాంగ్రెస్ అధిష్ఠానం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీ వేదికగా కేసీ వేణుగోపాల్ (KC Venugopal), మల్లికార్జున ఖర్గేలతో జరిగిన చర్చల్లో కేవలం కొండా సురేఖ అంశం మాత్రమే ప్రస్తావనకు వచ్చింది తప్ప విస్తరణపై ఎలాంటి ప్రకటన రాలేదు.

Cabinet Expansion | ఆశావహుల ‘ఢిల్లీ’ ప్రదక్షిణలు

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ నేతలు, సురేఖ ఇష్యూ ఢిల్లీకి చేరగానే మళ్లీ హస్తిన బాట పట్టారు. అధిష్ఠాన పెద్దలను కలిసి తమకు పదవులు కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రస్తుతానికి కేవలం భర్తరఫ్ నిర్ణయానికే పరిమితమైన అధిష్ఠానం, విస్తరణపై ఎలాంటి ఆతురత చూపలేదని తెలుస్తోంది.

Cabinet Expansion | ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో పేరుకుపోతున్న అసంతృప్తి..

రాష్ట్రంలో కొన్ని జిల్లాలకే ప్రాతినిధ్యం పరిమితమవ్వడం, మరికొన్ని కీలక జిల్లాలకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడంపై ఆయా ప్రాంతాల నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ వంటి కీలక జిల్లాలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేస్తారని, బీసీలకు తగిన ప్రాధాన్యం ఇస్తారని భావించినప్పటికీ, ఇప్పట్లో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వాయిదా పడటంతో ఆశావహుల నిరాశ రెట్టింపయింది.

Cabinet Expansion | సెప్టెంబరు ఆఖరి వారంలో క్లారిటీ వచ్చే ఛాన్స్?

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తక్షణ విస్తరణ సాధ్యం కాదని పార్టీ భావిస్తోంది. సెప్టెంబరు నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఐసీసీ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్లు ఢిల్లీలో అధిష్ఠానంతో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం విస్తరణపై ఒక స్పష్టమైన సంకేతం రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటివరకు వేచిచూడటం తప్ప, పదవులపై కన్నేసిన సీనియర్ నేతలకు వేరే మార్గం లేకుండా పోయింది.

దీనిని కూడా చదవండి : Accident in Kamareddy | రెండు కార్ల మధ్యలో స్కూటీ ఇరుక్కుని బాలుడి మృతి

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *