అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Ganja Seller Arrest | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ (Nizamabad) పరిధిలో గంజాయి విక్రయిస్తున్న(Cannabis Sale) ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారు వివరాలు వెల్లడించారు.
Ganja Seller Arrest | విశ్వసనీయ సమాచారం మేరకు..
విశ్వసనీయ సమాచారం మేరకు, గతంలో పలువురు వ్యక్తులకు గంజాయిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడిపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లి, సదాశివనగర్ పోలీస్ స్టేషన్లతో పాటు, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ వన్ టౌన్, త్రీ టౌన్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఇది కూడా చదవండి: Traffic Restrictions | దూల్పేటలో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు