అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని దూల్పేటలో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 14 వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు.
దూల్‌పేట వినాయక విగ్రహాల తయారీకి పేరుగాంచిన విషయం తెలిసిందే. నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి భారీ ప్రతిమలను తీసుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 5 ఉదయం 7 గంటల నుండి సెప్టెంబర్ 14 రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Traffic Restrictions | ఇతర వాహనాలకు నో ఎంట్రీ
దూల్ పేటలోని బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం మధ్య సాధారణ ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఆఘాపూర, గోడే కే కబర్, జిన్సి, టక్కర్‌వాడి మీదుగా వాహనాలను మళ్లిస్తారు. విగ్రహాలను తరలించే వాహనాలు గాంధీ విగ్రహం / పురానాపూల్ మీదుగా వెళ్లాలి. విగ్రహాలను తరలించే వాహనాలు బోయిగూడ కమాన్ క్రాస్ రోడ్స్ మీదుగా బయటకు వెళ్లవచ్చు
Traffic Restrictions | ట్రాఫిక్ మళ్లింపులు
మంగళహాట్ నుంచి టక్కర్‌వాడి T-జంక్షన్, జిన్సీ చౌరస్తా ఘోడే-కీ-ఖబర్ వెళ్లాలి. సీతారాంబాగ్ నుంచి అఘాపుర, జిన్సీ, జుమ్మేరాత్ బజార్ మీదుగా పురానాపూల్ చేరుకోవాలి. లారీలు, డీసీఎంలను జుమ్మేరాత్ బజార్ గ్రౌండ్, 100 అడుగుల రోడ్డు, పురానాపూల్‌లో పార్కింగ్ చేయాలి. రాత్రి 10 గంటల తర్వాతే విగ్రహాలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.
దీనిని కూడా చదవండి : Harish Rao Comments | కొండా సురేఖపై యాక్షన్.. మరి పొంగులేటిపై ఎందుకు లేదు?: రేవంత్‌కు హరీశ్ రావు ప్రశ్న