అక్షరటుడే, బాన్సువాడ: Petrol Shortage in Banswada | పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత (Diesel Shortage) తీవ్రరూపం దాలుస్తోంది. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Petrol Shortage in Banswada | పరిమితంగా ఇంధన సరఫరా..
పట్టణంలో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, మరికొన్ని బంకుల్లో పరిమితంగా మాత్రమే ఇంధనం అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్దకు చేరుకుంటున్నా.. ఇంధనం లభించక నిరాశతో వెను దిరుగుతున్నారు. కొందరు అవసరాల నిమిత్తం సమీప పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్లే ఈ కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్లు (Oil Tankers) సమయానికి రాకపోవడం, డిమాండ్ పెరగడం కూడా కారణాలుగా చెబుతున్నారు. కొందరు వాహనదారులు బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు ఇంధనం కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Road Accident in Mosra | మోస్రాలో విషాదం.. వడ్లకుప్పను స్కూటీ ఢీకొని యువతి మృతి


[…] […]