అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Child Kidnapping Case | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి శనివారం ఉదయం రెండేళ్లన్నర వయసున్న కోసడి వేదాన్స్ను అనే చిన్నారి అపహరణకు గురైన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, బాధితుల కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించారు.
బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన నరేష్ కుమారుడు కోసడి వేదాన్స్ (2½ ఏళ్లు) నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న సమయంలో ఓ గుర్తుతెలియని మహిళ అతడిని ఎత్తుకెళ్లింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nizamabad Child Kidnapping Case | కుటుంబానికి సీపీ భరోసా..
సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, బాధిత చిన్నారి తండ్రి నరేష్‌తోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆందోళనను విన్న సీపీ, ధైర్యంగా ఉండాలని సూచిస్తూ.. చిన్నారిని సురక్షితంగా వెనక్కి రప్పిస్తామని గట్టి భరోసా ఇచ్చారు.
Nizamabad Child Kidnapping Case | అధికారులకు ఆదేశాలు.. గాలింపు తీవ్రం
ఈ కేసు దర్యాప్తును కమిషనర్ స్వయంగా సమీక్షించారు. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సైబర్ క్రైమ్, సాంకేతిక బృందాల (Technical Teams) సహాయంతో నిందితురాలి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. అపహరణకు పాల్పడిన గుర్తుతెలియని మహిళను త్వరితగతిన గుర్తించి, బాలుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Yusmarg Encounter | యూస్‌మార్గ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్.. లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ మృతి
ఘటనకు సంబంధించిన ప్రతి కోణాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని, చిన్నారి సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను సీపీ సాయి చైతన్య ఆదేశించారు.