Rajasthan Heavy Rains | రాజస్థాన్​లో దంచికొడుతున్న వానలు.. భారీగా ఆస్తి నష్టం

రాజస్థాన్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రోడ్లు జలమయం అయి రాకపోకలు నిలిచిపోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan Heavy Rains | రాజస్థాన్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధోల్పూర్‌లో వరద ముంచెత్తింది. దీంతో రహదారులు, లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి.

వర్షాలతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతి నది (Parvathi River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పార్వతి నది డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సైపౌ, మాలోని, సఖ్వారా దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దౌసా జిల్లాలోని మహ్వాతో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దుకాణాలు, ఇళ్లలోకి నీరు చేరింది. వాతావరణ శాఖ అధికారులు 20 జిల్లాలకు రెడ్​ అలర్ట్ జారీ చేశారు.

Rajasthan Heavy Rains | నీట మునిగిన రోడ్లు..

భారీ వర్షాలతో వాగుల్లో నీటి మట్టాలు పెరిగి, సవాయి మాధోపూర్, బరన్, బుండి మరియు కోటా ప్రాంతాల్లోని అనేక చోట్ల కాజ్‌వేలు నీట మునిగిపోయాయి. వర్షాలు సెప్టెంబర్ 8 వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాలు కురుస్తుండటంతో జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో భరత్‌పూర్‌లోని బంధ్ బరేథా ఆనకట్ట రెండు గేట్లు ఎత్తారు. ధోల్‌పూర్‌లోని పార్వతి ఆనకట్ట, ఝలావర్‌లోని కాళీసింధ్ ప్రాజెక్ట్​, కోటాలోని నవనేరా డ్యామ్​ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

 

దీనిని కూడా చదవండి : BRS Meeting | ఎర్రవెల్లి ఫామ్​హౌజ్​లో బీఆర్​ఎస్​ఎల్పీ భేటీ.. పొంగులేటి విమర్శలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *