అక్షరటుడే, వెబ్డెస్క్: NRI Policy | ఎన్ఆర్ఐ పాలసీ తీసుకు రావాలని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మిక అవగాహన వేదిక (జీడబ్లూఏసీ) 10వ ఆవిర్భావ దినోత్సవ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబాయిలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
NRI Policy | సమస్యల పరిష్కారం కోసం..
సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ పోరాటం చేస్తుందన్నారు. పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అనేక కార్యక్రమాలు చేశామన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధనే జీడబ్లూఏసీ లక్ష్యమన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను తమ సంస్థ ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లిందన్నారు. దుబాయిలో జరిగిన ఈ సమావేశానికి పలు ప్రాంతాల్లో పని చేస్తున్న గల్ఫ్ కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గల్ఫ్ దేశాలు లక్షల మందికి అన్నం పెడుతున్నాయన్నారు.
ఈ వీడియో చూడండి : గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సమ్మేళనం