Woman Attacked | వృద్ధురాలిపై దాడి చేసి చెవికమ్మలు చోరీ

నిజామాబాద్ నగరంలోని బంగారు మైసమ్మ కాలనీలో ఓ వృద్ధురాలిపై దుండగుడు దాడి చేశాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Woman Attacked | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని బంగారు మైసమ్మ కాలనీలో ఓ వృద్ధురాలిపై దుండగుడు దాడి చేశాడు. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బంగారు చెవి కమ్మలు లాక్కెళ్లాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

బంగారు మైసమ్మ కాలనీలో అరుంధతి అనే వృద్ధురాలి నివాసం ఉంటుంది. నితిన్​ అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. చెవి కమ్మలు, రూ.500 తీసుకున్నాడు. చెవి కమ్మలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ ఇంట్లో అందుబాటులో ఉన్న కత్తెర తో ఆమె చెవికి ఒక గాయపరిచి కమ్మలు లాక్కున్నాడు. అనంతరం గడ్డపారతో ఆమెపై దాడి చేశాడు.

Woman Attacked | నిందితుడి అరెస్ట్​

ఈ ఘటనలో అరుంధతి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని త్రీ టౌన్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిని కూడా చదవండి : RJ Charan Bigg Boss | రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్‌కు.. నిజామాబాద్ కుర్రాడి జోరు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.