BRS MLAs Arrest | అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల అరెస్ట్​

అసెంబ్లీ గేట్​ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS MLAs Arrest | అసెంబ్లీ గేట్​ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్ట్​ చేసి అక్కడి నుంచి తరలించారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలన విఫలమైందని బీఆర్ఎస్​ సభ్యులు గన్​పార్క్​ వద్ద నిరసన తెలిపారు. నల్ల టీ షర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.

BRS MLAs Arrest | కేటీఆర్​కు గాయం

పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నుదుటికి, చేతికి గాయం అయింది. మాజీ మంత్రి హరీశ్​రావు సైతం కింద పడ్డారు. దీంతో హరీశ్​రావు (Harish Rao) తన చొక్కా విప్పేసి నిరసన తెలిపారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ టీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లలేదా అని హరీశ్​రావు ప్రశ్నించారు.

BRS MLAs Arrest | కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి

బీఆర్ఎస్​ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. తన చీర లాగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Assembly Sessions | రాజకీయ సమరం.. ప్రజా సమస్యలకు గ్రహణం.. అసెంబ్లీ వేదికగా మళ్లీ తిట్ల పర్వమేనా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *