Assembly Sessions | వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఏసీ (BAC)లో నిర్ణయం తీసుకున్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్​ అధ్యక్షతన సోమవారం సాయంత్రం బీఏసీ సమావేశం జరిగింది. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు సభలోకి వెళ్లకుండ అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా కేటీఆర్​తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు గాయాలు అయ్యాయి.

Assembly Sessions | రీయింబర్స్​మెంట్​పై చర్చ

బీఆర్​ఎస్ (BRS)​ మినహా మిగతా పార్టీలు బీఏసీ సమావేశానికి హాజరు అయ్యాయి. వారంపాటు సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై మరోసారి భేటీ కానున్నట్లు స్పీకర్​ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు బీఏసీ ఆమోదం తెలిపింది. 22ఏపై జ్యుడీషియల్ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్​ చేసింది. 25 అంశాలపై చర్చించాలని ఆ పార్టీ నాయకులు కోరారు.

Assembly Sessions | హరీశ్​రావును అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీలో BAC సమావేశానికి హాజరు కావాలంటూ హరీశ్ రావు (Harish Rao)కి స్పీకర్ ఫోన్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీకి ఆయన బయలుదేరారు. తెలంగాణ భవన్ గేటు వద్దే పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు హరీశ్​రావు ప్రకటించారు.

ఈ వీడియో చూడండి : యూట్యూబర్​ నందన్​ అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *