Nandu’s World Scam Arrest | లగ్జరీ ముసుగులో మోసం.. నందూస్ వరల్డ్ నందన అరెస్టు.. వెలుగులోకి సోషల్ మీడియా క్రేజ్ వెనుక నల్ల నిజాలు!

సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది నెటిజన్లను ఆకట్టుకునే లగ్జరీ లైఫ్‌స్టైల్ వ్లాగ్స్ వెనుక ఇంతటి మోసం ఉందా?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nandu’s World Scam Arrest | లండన్ London వీసాలు, ఉద్యోగాల పేరిట సాగిన కోట్ల రూపాయల స్కామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు గుంటూరుకు చెందిన రామనందన (నందన) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులకు చిక్కింది.

డిజిటల్ తెరపై వెలిగిపోతున్న క్రేజ్ చూసి గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోతారనే దారుణమైన నిజాన్ని ఈ ఘటన మరోసారి సమాజం ముందు నగ్నంగా నిలబెట్టింది.

Nandu’s World Scam Arrest | లగ్జరీ వ్లాగ్స్ నుంచి ‘చిరంజీవి’ సినిమా ఆఫర్ వరకు!

కరోనా కాలం ముగిశాక లండన్‌లో తమ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను చూపిస్తూ ‘నందూస్ వరల్డ్’ పేరుతో వ్లాగ్స్ చేయడం ప్రారంభించారు రామనందన, ఆమె భర్త మధుకర్. లండన్ అందాలు, విలాసవంతమైన జీవనశైలితో అతి తక్కువ సమయంలోనే ఈ దంపతులు ఏకంగా 28 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

ఈ విపరీతమైన క్రేజ్ తోనే ఆమెకు ఏకంగా సినీ దిగ్గజం చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ చిత్రంలోనూ నటించే అవకాశం దక్కింది. అయితే, ఈ రంగుల ప్రపంచం వెనుక వీరు సాగిస్తున్న అక్రమాలు మాత్రం ఎవరూ ఊహించలేదు.

Nandu’s World Scam Arrest | స్కామ్ ఎలా సాగింది?

ఒక సామాన్య ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగిన వ్యక్తులు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ స్థాయికి ఎలా దిగజారారనేది పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫేక్ స్పాన్సర్‌షిప్‌ల జాలం: ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక బాధితుడికి యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి ₹15 లక్షలు వసూలు చేశారు. తీరా ఇచ్చిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (COS) నకిలీదని, అసలు లండన్‌లో అటువంటి కంపెనీయే లేదని విచారణలో తేలింది.

Telangana Assembly Black Dress Protest | రాజకీయ వేడి పెంచిన నల్ల చొక్కా వివాదం..అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసనలపై ఆసక్తికర చర్చ!

మోసం బయటపడ్డాక బాధితుడు డబ్బులు తిరిగివ్వమని నిలదీస్తే.. ₹2 లక్షలు ఇచ్చి, మిగతా డబ్బు ఎగ్గొట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. లండన్ నుంచి మధుకర్ నడిపే ఈ దందాలో తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ మొత్తాన్ని యూకే లోని ఒక కంపెనీకి పంపడం, అక్కడి నుంచి మళ్లీ ఇండియాలోని ఒక కంపెనీకి వైట్ మనీగా ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా మనీ లాండరింగ్ తీవ్ర నేరానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

Nandu’s World Scam Arrest | లుక్అవుట్ నోటీసులు.. హైదరాబాద్‌లోనే చెక్!

యూకే పౌరసత్వం ఉందనే ధీమాతో లండన్‌లో ఉండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఈ దంపతులపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు (Lookout Notices) జారీ చేశారు.

“తాము ఎవరినీ మోసం చేయలేదు, మాకు ఏ కంపెనీలు లేవు” అని ఒక వీడియో వదిలి, ఏమీ తెలియనట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే శంషాబాద్ వద్ద పోలీసులు నందనను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

సోషల్ మీడియా ప్రొఫైళ్లలో కనిపించే మిలియన్ల ఫాలోవర్లు, విలాసవంతమైన కార్లు, లండన్ వీధుల వెలుగులు ఒక మాయా ప్రపంచం మాత్రమే కావచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్ల వెనుక ఉండే సెలబ్రిటీ హోదాను చూసి, వీసాలు, ఉద్యోగాలు, ప్రాపర్టీల విషయంలో కష్టపడి సంపాదించిన రూ. లక్షలు గుడ్డిగా వాళ్ల అకౌంట్లలో వేస్తే నిలువునా మునిగిపోవడం ఖాయమని ఈ “నందూస్ వరల్డ్” స్కామ్ మరొక ఘాటైన హెచ్చరికను జారీ చేసింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *