అక్షరటుడే, వెబ్డెస్క్: CPR Saves Life | మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) వేగంగా స్పందించి ఒకరి ప్రాణాలు కాపాడారు. అసెంబ్లీ ఆవరణలో ఓ వ్యక్తి కుప్పకూలగా.. వెంటనే మంత్రి సీపీఆర్ చేశారు.
నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ రాజు అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కూలారు. అక్కడ ఉన్న మంత్రి శ్రీహరి వెంటనే స్పందించారు. పరిస్థితిని గమనించిన మంత్రి ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, బాధితుడిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Assembly Sessions | అసెంబ్లీలో రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్