CPR Saves Life | సీపీఆర్​ చేసి ఒకరి ప్రాణాలు కాపాడిన మంత్రి

అసెంబ్లీ ఆవరణలో ఓ వ్యక్తి కుప్పకూలగా.. మంత్రి శ్రీహరి వెంటనే స్పందించి సీపీఆర్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CPR Saves Life | మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) వేగంగా స్పందించి ఒకరి ప్రాణాలు కాపాడారు. అసెంబ్లీ ఆవరణలో ఓ వ్యక్తి కుప్పకూలగా.. వెంటనే మంత్రి సీపీఆర్​ చేశారు.

నవీన్ మిట్టల్ పర్సనల్​ సెక్రెటరీ రాజు అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా కూలారు. అక్కడ ఉన్న మంత్రి శ్రీహరి వెంటనే స్పందించారు. పరిస్థితిని గమనించిన మంత్రి ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్​ చేసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, బాధితుడిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Assembly Sessions | అసెంబ్లీలో రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *