తెలంగాణCV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌.. మే 1న బాధ్యతల...

CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌.. మే 1న బాధ్యతల స్వీకరణ!

తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన ఆనంద్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

అక్షరటుడే, హైదరాబాద్: CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను(CV Anand) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadhar Reddy) ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన ఆనంద్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

CV Anand DGP | మే 1న బాధ్యతల స్వీకరణ

ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా(Home Department) బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్‌.. మే 1వ తేదీన రాష్ట్ర పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2028 జూన్ వరకు ఆయన సర్వీస్‌లో ఉండనుండటంతో, దాదాపు రెండేళ్లకు పైగా ఆయన ఈ అత్యున్నత పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

CV Anand DGP | పోలీసు శాఖలో సుదీర్ఘ అనుభవం..

సీవీ ఆనంద్‌కు పోలీసు శాఖలో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్(Hyderabad) పోలీస్ కమిషనర్‌గా ఆయన అద్భుతమైన పనితీరు కనబరిచారు. 1993లో వరంగల్ ఏఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, నిజామాబాద్ ఎస్పీగా, గ్రేటర్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన సమర్థతను గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను కట్టబెట్టింది. సీవీ ఆనంద్ డీజీపీగా వెళ్తుండటంతో, ఆయన స్థానంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను ప్రభుత్వం నియమించింది.

ఇది కూడా చదవండి: PCB Price Hike | యుద్ధం ఎఫెక్ట్.. 40 శాతం పెరిగిన సర్క్యూట్ బోర్డుల ధరలు!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....