అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Caught DEE | ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారుల భరతం పడుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు వల పన్ని లంచాలు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటోంది. అయినా కూడా లంచాలకు మరిగిన పలువురు అధికారులు భయపడటం లేదు.
ACB Caught DEE | క్వాలిటీ సర్టిఫికెట్ కోసం..
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ముషీరాబాద్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ సెల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) సాయిరామ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ చేపట్టిన పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కోసం డీఈఈ రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి మంగళవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కార్యాలయంలో సోదాలు చేశారు.
దీనిని కూడా చదవండి : Bathukamma Filmmakers Challenge | బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్.. రూ.3 లక్షల బహుమతి