అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Seizes US Submarine | హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన సబ్‌మెరైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. డైవ్-ఎల్‌డిగా గుర్తించబడిన ఈ మానవరహిత జలాంతర్గామిని నిఘా ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు నౌకాదళం పేర్కొంది.
జలాంతర్గామి ప్రపంచంలోనే అత్యంత ఆధునిక జలాంతర్గామి వాహన సాంకేతికతతో కూడి ఉందని ఇరాన్ పేర్కొంది. దానిని స్వాధీనం చేసుకున్న వీడియోను కూడా విడుదల చేసింది. అంతేగాకుండా హర్ముజ్ జలసంధిపై తమ వాయు రక్షణ వ్యవస్థలు ఒక MQ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేశాయని IRGC ప్రకటించింది.
Iran Seizes US Submarine | స్పందించిన అమెరికా
ఐఆర్జీసీ ప్రకటన తర్వాత అమెరికా స్పందించింది. ప్రాంతీయ జలాల సర్వే సందర్భంగా ఒక రోజు క్రితం తమ జలాంతర్గామి డ్రోన్లలో ఒకటి సరిగా పని చేయలేదని పేర్కొంది. ఇరాన్ స్వాధీనం చేసుకున్నది ఆ పరికరమేనా కాదా అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. లోపాలున్న ఆ డ్రోన్ ఒక పాత మోడల్ అని తెలిపింది. అది సున్నితమైన డేటాను సేకరించలేదు, అలాగే ఎలాంటి రహస్య సోనార్ లేదా రాడార్ పరికరాలను కూడా కలిగి లేదని యూఎస్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
Iran Seizes US Submarine | కొనసాగుతున్న దాడులు
డైవ్-ఎల్డీ బేస్‌కు తిరిగి రాకుండా 10 రోజుల వరకు పనిచేయగలదు. అంతేగాకుండా నీటిలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లేలా దానిని తయారు చేశారు. డైవ్-ఎల్డి యూనిట్ల ధర ఒక్కొక్కటి సుమారు 2.5 మిలియన్ డాలర్లు. ఇరాన్ అమెరికా యుద్ధనౌకపై దాడి చేసిన తర్వాత, తమ దళాలు ఐదు ఇరాన్ ముడి చమురు ట్యాంకర్లను ధ్వంసం చేశాయని యూ.ఎస్. సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి..: iPhone 18 Series | రేపే యాపిల్ మెగా ఈవెంట్.. ఫోల్డబుల్ ఐఫోన్‌పై భారీ అంచనాలు