అక్షరటుడే, వెబ్‌డెస్క్: Talasani Srinivas Yadav | అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో లేనివారిని సైతం సస్పెండ్ చేశారని విమర్శించారు.
అసెంబ్లీ లాబీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చిట్‌చాట్‌లో మాట్లాడారు. శాసన సభను అభాసుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి గురించి చర్చించకుండా డైవర్షన్ చేస్తున్నారన్నారు. మొదటి రోజు అసెంబ్లీ గేటు బయట, రెండో రోజు కేసీఆర్ (KCR) వ్యవసాయ క్షేత్రం వద్ద డ్రామా నడిపించారని విమర్శించారు.
Talasani Srinivas Yadav | కేసీఆర్ చావు కోరుకుంటున్నారు..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని తలసాని అన్నారు. కేసీఆర్ చావు కోరుకున్న ఎమ్మెల్యేను సస్పెండ్ చెయ్యలేదని, కానీ తిరుపతిలో ఉన్న మల్లారెడ్డిని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. సభలో లేని కేటీఆర్, గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. 22- A అంశం జీవో 97 చర్చకు వస్తాయిని ప్రభుత్వం భయపడుతుందని, అందుకే తమను సస్పెండ్ చేసిందన్నారు. దళిత స్పీకర్ అంటూ స్పీకర్‌ను కాంగ్రెస్ అవమానిస్తుందని పేర్కొన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే బీఆర్ఎస్కు గౌరవం ఉందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Sabitha Indra Reddy | మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేదు : సబితా ఇంద్రారెడ్డి