అక్షరటుడే, వెబ్డెస్క్: TTD Devotees Insurance | కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులకు టీటీడీ కీలక వార్త చెప్పింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎల్ఐసీ ద్వారా బీమా సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ (TTD) పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెలల్లడించారు. ఎల్ఐసీ ద్వారా భక్తులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రమాదశాత్తు మరణించిన వారి కుటుంబాలకు బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయ తీసుకున్నారు. తిరుమలలో సహజ మరణానికి రూ.2 లక్షల బీమా ఇస్తామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం LIC సంస్థకు టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.
TTD Devotees Insurance | ఉద్యోగుల సంక్షేమానికి..
పాలక మండలి సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షనర్లు, వారి కుటుంబాలకు EHF సౌకర్యం కల్పిస్తూ, రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు ఆమోదం తెలిపారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్ వర్కర్ పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపుతామని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 48 మంది ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు.
ఇది కూడా చదవండి..: MRP Overcharging Fine | రూ.7 కక్కుర్తికి..రూ.7 లక్షల ఫైన్