అక్షరటుడే వెబ్‌డెస్క్: E20 Petrol | ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటివరకు E20 ఇంధనంతో వాహనాలు పాడవుతున్నట్లు రవాణా శాఖకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఈ అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోందని చెప్పారు.
E20 Petrol | ఎలాంటి ఫిర్యాదులు అందలేదు..
తమ శాఖకు ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయలేదని మంత్రి తెలిపారు. విదేశీ మారకద్రవ్య నిల్వలను ఆదా చేయడం, రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి ప్రయోజనాలు ఉండటం వల్లే E20 విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చిందని, ఈ ఏడాది నుంచి తయారవుతున్న కొత్త వాహనాలన్నింటికీ E20 ధ్రువీకరణ తప్పనిసరి చేశారని గుర్తుచేశారు.
E20 Petrol | అపోహలు మాత్రమే..
మైలేజీ పరంగా కొంత స్వల్ప తేడా ఉండొచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ, దీనివల్ల పెద్దఎత్తున నష్టం జరుగుతుందనేది అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. E20 పెట్రోల్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు రాష్ట్ర రవాణా శాఖ త్వరలో ప్రత్యేక కార్యాచరణను చేపడుతుందని వెల్లడించారు. మరోవైపు ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటు వల్ల కాలుష్యం వస్తుందంటూ కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, వాటిలో నిజం లేదన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇథనాల్ పెట్రోల్‌తో వాహనాలపై సమస్యలు లేవు: పొన్నం ప్రభాకర్
ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగంతో వాహనాలు పాడవుతున్నాయనే విషయం తమ రవాణా శాఖ దృష్టికి రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. @Ponnam_INC #Udayam #BreakingNews #PonnamPrabhakar #EthanolBlending #Petrol #Telangana pic.twitter.com/G0u6vV9DhB
— ఉదయం (@udayamdigital) September 9, 2026
ఇది కూడా చదవండి: Jagan Padayatra | పాదయాత్ర పై వైఎస్ జగన్ కీలక అప్డేట్